98వ ఆస్కార్ అవార్డుల రేటింగ్స్ ఈసారి నిరాశపరిచాయి. కోనన్ ఓబ్రియన్ హోస్ట్‌గా చేసిన ఈ వేడుకను 17.9 మిలియన్ల మంది వీక్షించగా, గత ఏడాదితో (19.7 మిలియన్లు) పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. ముఖ్యంగా 18-49 ఏళ్ల మధ్య వయసు గల ప్రేక్షకులలో 14 శాతం తగ్గుదల నమోదైందని వాల్ట్ డిస్నీ తెలిపింది. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఆదరణకు ఈసారి బ్రేక్ పడటం గమనార్హం.