KMR: రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీఎంహెచ్వో డాక్టర రవీందర్ గౌడ్ సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. జనరల్ ఆసుపత్రి నుంచి వచ్చిన నిపుణులైన వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.