SDPT: బెజ్జంకి మండలం గుగ్గిల గ్రామంలో బాలవికాస సమితి ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నీటి సంరక్షణపై నినాదాలతో ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రజలను చైతన్యపరిచారు. మానవహారం ఏర్పాటు చేసి నీటి పొదుపు అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య, ఉపసర్పంచ్ లావణ్య, హెచ్ఎం మమత ఉన్నారు.