తమిళనాడు రాజకీయ వివాదాల్లోకి నటీమణులను లాగడంపై నటుడు మంచు విష్ణు తీవ్రంగా స్పందించాడు. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలను వాడుకోవడం అత్యంత అసభ్యకరమని మండిపడ్డాడు. నటీనటులకు కూడా భావోద్వేగాలు, కుటుంబాలు, గౌరవం ఉంటాయని.. వారి ప్రైవేట్ స్పేస్‌ను సమాజం గౌరవించాలని హితవు పలికాడు. రాజకీయ విమర్శల్లో నటీమణులను కించపరచడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు.