లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 98వ ఆస్కార్ వేడుకల్లో గతేడాది కన్నుమూసిన సినీ దిగ్గజాలకు ‘In Memoriam’ విభాగంలో ఘన నివాళులర్పించారు. అకాడమీ తన వెబ్సైట్లో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా గర్వించదగ్గ ప్రముఖులు ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు పేర్లను ప్రచురించింది. ప్రపంచ సినీరంగానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.