NRPT: కోస్గిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో ప్లాస్టిక్ వినియోగ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చేపట్టిన ’99 డేస్ బ్రేక్ ది ప్లాస్టిక్ హ్యాబిట్’ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగీతలక్ష్మి ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే హానులను వివరించారు.