NRML: దేశాభివృద్ధికి జనగణన కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. 2027 జనాభా గణనపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక సదుపాయాల ప్రణాళికకు జనగణన సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.