SRD: పటాన్ చెరువులో రైల్వే స్టేషన్ ఏర్పాటు, పలు అభివృద్ధి అంశాలపై దక్షిణ మధ్య రైల్వే డీజీఎంతో ఎంపీ రఘునందన్ రావు చర్చలు జరుపుతున్నారని పటాన్ చెరువు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. ఇవాళ HITTV ప్రతినిధితో మాట్లాడుతూ.. రైల్వే లైన్ కారణంగా ఇళ్లు కోల్పోతున్న బాధితుల పక్షాన నిలుస్తామని, వారికి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.