అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతర ప్రత్యేక అధికారి సుజాత పాల్గొన్నారు.