SKLM: ఆమదాలవలస మండలం జొన్నవలస ప్రభుత్వ ఆసుపత్రిలో మండల అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదంపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నివారించాలి, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే చేపట్టాల్సిన చర్యలపై ప్రదర్శన ఇచ్చారు. ఆసుపత్రి వంటి ప్రదేశాల్లో జాగ్రత్తలు మరింత అవసరమని సూచించారు.