ELR: బుట్టయిగూడెం మండలంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు బుధవారం అశ్వారావుపేట అటవీ శాఖ అధికారులను కలిశారు. అటవీ ప్రాంతంలో వెలసిన మంగమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ రేంజర్, డిప్యూటీ డీఎఫ్ఓలకు వినతి పత్రం సమర్పించారు. అటవీ శాఖ నుంచి సానుకూల స్పందన వస్తే త్వరలోనే నిర్మాణ పనులు చేపడతామన్నారు