VSP: ఏపీఈపీడీసీఎల్ నిర్వహించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి 37 ఫిర్యాదులు వచ్చాయని సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం విశాఖలో జరిగింది. వినియోగదారులు లో-వోల్టేజ్, లైన్ల మార్పు, విద్యుత్ బిల్లులు, ట్రాన్స్ఫార్మర్ మార్పిడి, కొత్త కనెక్షన్లు, రూఫ్‌టాప్ సోలార్, బిల్లులో పేరు మార్పు వంటి సమస్యలను వెల్లడించారు.