GDWL: జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఎర్రవల్లి మండల అభివృద్ధికి సహకరించాలని ఎర్రవల్లి మాజీ సర్పంచ్ జోగుల రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రవల్లి మండలంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేయాలని కోరారు.