ADB: జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంను కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. స్విమ్మింగ్ పూల్, ఇతర క్రీడా వసతులను పరిశీలించి, అథ్లెట్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, క్రీడల అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరాలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.