VSP: ఆనందపురం మండలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన ఉన్న తోటలో చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పదంగా ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడు పైల నారాయణ స్వామి(60)గా ఆనందపురం పోలీసులు గుర్తించారు. అతను ఓ ప్రైవేట్ పాఠశాలలో వాచ్మెన్గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలిసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.