ADB: సిరికొండ మండలం తుమ్మల్పాడ్ సమీప వాగుపై కల్వర్టు నిర్మాణ పనులను సర్పంచ్ దీపక్ ప్రారంభించారు. గురువారం ఆయన పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో వాగు ఉద్ధృతి వల్ల ప్రజలు పట్టణాలకు, ఆసుపత్రులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ కల్వర్టుతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.