GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ NSS ఆధ్వర్యంలోని సోమవారం కొప్పురావూరు, కంతేరులో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కంతేరులో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, రోగులకు పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. కొప్పురావూరులో పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో NSS అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.