KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ పరికరాలను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి మానసిక వికాసానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.