VSP: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 18న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఆనందపురం మండలం కోరాడలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు హాసిని వర్మ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీల బకాయిలు, రైతుల సమస్యలపై షర్మిల మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, రైతులు పెద్దఎత్తున తరలిరానున్నారని నేతలు పిలుపునిచ్చారు.