MNCL: చట్టసభల్లో మహిళలకు కల్పించే రిజర్వేషన్లలో సబ్ కోట కల్పించేలా బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎలాంటి ఉప కోటా లేనందున బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.