ఏలూరులో మరోసారి విజిలెన్స్ అధికారులు మొబైల్ దుకాణాలపై సోమవారం దాడులు నిర్వహించారు. ఆర్.ఆర్.పేటలోని మహదేవ్ మొబైల్స్‌లో ఒరిజినల్ పేరుతో డూప్లికేట్ అమ్ముతున్నారు అన్న ఆరోపణలతో ఆ దుకాణంలో ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. సెల్ ఫోన్ యాక్సెసరీస్‌కు సంబంధించిన బిల్లులను ఒరిజినల్ సామాగ్రి వివరాలను వారు సేకరిస్తున్నారు.