NGKL: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా తమ గ్రామాలు ముంపునకు గురికావద్దని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు కొంత కాలంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షలు సోమవారంతో 105వ రోజుకు చేరుకున్నాయి. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు స్పష్టం చేశారు.