NLG: అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై చేస్తున్న దాడుల వల్ల ఏర్పడ్డ సంక్షోభాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివారించాలని సీపీఐ మండల కార్యదర్శి అక్బర్, సహాయ కార్యదర్శి జిల్లా సత్యం అన్నారు. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని, నిత్యవసర ధరలు పెరిగాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వారు తాహశీల్దార్ విజయకు వినతిపత్రని అందించారు.