BDK: అశ్వాపురం మండలం చింతిర్యాల గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను సోమవారం మధ్యాహ్నం పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చింతిర్యాల గోదావరి నది నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్న డ్రైవర్ లంక సాయిరాం నుంచి ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.