MLG: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ములుగు కలెక్టరేట్లో జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎం.సంపత్ రావు మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని తెలిపారు. జిల్లాలో బాలల సమస్యల పరిష్కారం, బాల్యవివాహాల నివారణ, బడి మానిన పిల్లలను తిరిగి చదువులో చేర్చే చర్యలు తీసుకుంటామని చెప్పారు.