VZM: రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో భాగంగా 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన 13 మంది రైతులకు ఆయన ఉత్తర్వులు అందజేశారు.