NLR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సోమవారం ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు 6 ప్రత్యేక రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలు అవగాహన కల్పిస్తున్నాయి. హైవేలు, ప్రధాన కూడళ్ల వద్ద హెల్మెట్ ప్రాధాన్యత, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.