అన్నమయ్య: అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో పాత్రికేయులతో సమావేశమైన మంత్రి, తహసీల్దార్‌తో మాట్లాడి రాయచోటి పట్టణంలో అక్రిడేషన్ జర్నలిస్టులకు వెంటనే స్థలాలు మంజూరు చేయాలని ఆదేశించారు.