NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడులో సోమవారం వెటర్నరీ ఏడీ డా.కొండా రెడ్డి ఆధ్వర్యంలో పశువైద్యాధికారి డా.కృష్ణ కుమార్ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఇవాళ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. పాడి రైతులందరూ ఈ కార్యక్రమాన్ని తప్పక వినియోగించుకోవాలని వారు సూచించారు. JVO బాషా, పశుసంవర్ధక కార్యదర్శి బేగ్ పాల్గొన్నారు.