టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫేవరేట్ సినిమా గురించి వెల్లడించాడు. ‘త్రీ ఇడియట్స్’ మూవీ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. సినిమాను ఎప్పుడూ చూసినా ఆస్వాదిస్తానని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. త్రీ ఇడియట్స్ సినిమాను స్నేహితుడు పేరిట శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళంలోకి రీమెక్ చేసిన సంగతి తెలిసిందే.