AP: మంగళగిరి జనసేన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను APలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఈవెంట్‌కు పవన్‌ను దిల్ రాజు ఆహ్వానించారు. అలాగే సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఇరువురు చర్చలు జరిపారు. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4 లేదా 5వ తేదీన జరగనుంది.
తమిళ నటుడు కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘డా.. డా’ మూవీ తెలుగులో ‘పా.. పా’గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2025 జనవరి 3న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు కె. గణేష్ బాబు తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో గతేడాదిలో రిలీజై సూపర్ హిట్ అందుకుంది.
అమెజాన్ ప్రైమ్‌లో మంచి విజయం అందుకున్న సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. ఇప్పటికే రెండు సీజన్లు రాగా.. త్వరలో మూడో సీజన్ రాబోతుంది. ఈ సిరీస్‌లో నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు మనోజ్ ప్రకటించారు. త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు.
విడుదలకు ముందే రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత పెద్ద కటౌట్ ఏ హీరోకి ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు సినీ ప్రపంచంలో ఎక్కడ చూసినా 256ఫీట్ల కటౌట్ గురించే చర్చ నడుస్తోంది.
AP: విజయవాడలో ఏర్పాటు చేసిన 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్‌ను నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో చర్చించనున్నట్లు తెలిపాడు. పవన్ చెప్పే డేట్‌ని బట్టి ఈవెంట్ ఎక్కడ చేయాలో నిర్ణయిస్తామని పేర్కొన్నాడు. అలాగే.. జనవరి 1న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.
‘మన్‌కీ బాత్’ కార్యక్రమం 117వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ కొనియాడారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా బాగా చూపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు.
ఈ ఏడాదిలో పలు రీమేక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిల్లో కొన్ని విజయం సాధించగా మరికొన్ని పరాజయం పొందాయి. నాగార్జున నటించిన ‘నా సామిరంగ’.. మలయాళ మూవీ ‘పొరింజు మరియం జోస్’కు రీమేక్. మంచి విజయం అందుకుంది. రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ బాలీవుడ్ మూవీ ‘రైడ్’కు రీమేక్. ఇది పరాజయం పొందింది. అల్లు శిరీష్ ‘బడ్డీ’ తమిళ సినిమా R...
‘గుంటూరు కారం’లోని కుర్చీని మడతపెట్టి, దమ్ మసాలా పాటలతో పాటు ‘హనుమాన్’లోని హనుమాన్ చాలీసా, అంజనాద్రి, థీమ్, పూలమ్మే పిల్లా పాటలు ఆకట్టుకున్నాయి. ‘టిల్లు స్క్వేర్’లోని రాధికా, టిక్కెట్టే కొనకుండా పాటలు, ‘ఫ్యామిలీ స్టార్’లోకి కళ్యాణి వచ్చా, ‘మిస్టర్ బచ్చన్’లోని రెప్పల్ డప్పుల్ల, ఏ అబ్బాచా, దేవర, పుష్ప 2, అమరన్ మూవీలోని పాటలతో పాటు ...
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ 2025 జనవరి 10న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ విడుదలను పురస్కరించుకుని విజయవాడలో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల చరణ్ కటౌట్‌ను అభిమానులు పెట్టారు. ఈ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో KGF హీరోయిన్ శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. కాగా, ‘జైలర్’ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.
సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘OG’. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై కీలక ప్రకటన చేశారు. ‘మీరు ఈ సినిమాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానం మా అదృష్టం. మీకు చిన్న రిక్వెస్ట్. దయచేసి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన OG.. OG అని అరిచి ఇబ్బంది పెట్టకండి. రాష్ట్ర ప్రజల కోసం ఆయన కష్టపడుతున్నారు. మరి కొన్ని రోజులు కాస్త ఓపిక పట్టండి’ అంటూ పోస్ట్ పెట్టారు.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇదే తన తొలి సినిమా. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ తదుపరి ప్రాజెక్టుపై సాలిడ్ అప్డేట్ వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన ఓ మూవీ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై నిర్మాత సాహు గారపాటి అప్డేట్ ఇచ్చాడు. తాము ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని, ప్రస్తుతం ఈ సినిమాపై వస్తున్న కొన్ని వార్తలను నమ్మొద్దని వెల్లడించాడు.
టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా ఏఐ సాయంతో సమంత బేబీ బంప్ ఫొటోలు తయారు చేశారు. ఈ ఫొటోల సాయంతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సమంతకు ప్రెగ్నెన్సీ అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ధనుష్ డైరీలో ఓ కొత్త సినిమా వచ్చి చేరింది. ఇది కూడా బయోపిక్కేనని సమాచారం. ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని టాక్. నిజానికి రాజ్‌కుమార్ ఓ బాలీవుడ్ సినిమాను ఇటీవలే ప్రకటించాడు. అయితే.. ఆ సినిమాకంటే ముందే ధనుష్‌తో సినిమా ఉంటుందని తెలుస్తోంది.