‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 15న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడుకకు 1,500 మందికే అనుమతి ఉండగా, 5,000 మందికి పైగా హాజరయ్యారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సెక్షన్ 188 కింద FIR నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.