నటి మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సినీ పరిశ్రమలోకి బయటి వ్యక్తిగా అడుగుపెట్టి నిలదొక్కుకోవడం సవాలే. అవకాశాలు నాకు సులభంగా రాలేదు; నేనే వాటిని వెతుక్కుంటూ వెళ్లాను. నటనపై ఉన్న ప్రేమతో దర్శకులను కలిసి అవకాశాలు అడగడానికి నేను ఎప్పుడూ సిగ్గుపడలేదు. ప్రస్తుతం దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల మధ్య సమతుల్యత పాటిస్తూ కెరీర్లో ముందుకు సాగుతున్నాను’ అని పేర్కొంది.