ఫోన్, టీవీ, శబ్దాలు.. ఇవేవీ లేకుండా మీరు ఏకాంతంగా కూర్చొని ఎన్నాళ్లయింది? తరచూ అలా కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆ సమయంలో ఏ సమస్యలకూ పరిష్కారాలు ఆలోచించకండి. ఏ ప్రణాళికలూ వేసుకోకండి. ఏకాంతంగా గడపండి చాలు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీ మనసు కుదుటపడేందకు, ఆలోచనా ధోరణి మెరుగుపడేందుకు ఆ సమయం ఎంతో ఉపయోగపడుతుంది.