హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.1,57,750కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,44,600గా ఉంది. ముఖ్యంగా వెండి ఏకంగా రూ.5,000 తగ్గి రూ.2,75,000 వద్దకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.