ELR: రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు అతి ఉత్కృష్ట సేవ పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం ఈ జాబితాని విడుదల చేశారు. అతి ఉత్కృష్ట సేవ పతకాలకు ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ ఎంపిక అయినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 353 మంది పోలీసులకు అతి ఉత్కృష్ట సేవా పతకాలు 607 మందికి ఉత్కృష్ట పతకాలు అందిస్తామన్నారు.