ADB: హన్మకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బజార్హీత్నూర్ మండలం జాతర్ల గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థి కోట్నాక్ జాకేష్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. 60 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. విజేతను జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్ధసారథి, ఏటీడీఓ సుశాంత్ రెడ్డి అభినందించి సన్మానించారు.