అనకాపల్లి: పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరితోపాటు జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఆర్డీవో షేక్ ఆయిషా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష పాల్గొన్నారు.