కాబుల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ చేసిన దాడిలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిపై అఫ్గాన్ యువ స్పిన్నర్ మొహమ్మద్ ఘజన్ఫర్ మండిపడ్డాడు. అఫ్గానిస్తాన్ చరిత్ర గురించి అందరికీ తెలుసని.. చరిత్ర పునరావృతమైతే అది పాకిస్తాన్‌కు మంచిది కాదని హెచ్చరించాడు. అలాగే, తమ మిత్ర దేశమైన భారత్‌తో ఈ విషయాన్ని చర్చించాలనుకుంటున్నట్లు తెలిపాడు.