అన్నమయ్య: రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మంగళవారం రాంనగర్ 7వ వార్డు, ఎస్టీ కాలనీ, ట్యాంక్ వీధి ప్రాంతాల్లో ‘ఇంటింటి టీడీపీ’ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మురుగు కాలువలు, త్రాగునీటి సమస్యలపై అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల పక్షాన నిలబడటమే పార్టీ లక్ష్యమని ఆయన తెలిపారు.