KMM: రాజేశ్వరపురం వద్ద 2 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హేమలత వెల్లడించారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని రాజేశ్వరపురం, పాలేరు గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమ మద్యం రవాణా, సారా తయారీపై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.