TG: రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పండించినా, మద్దతు ధర లేక నష్టపోతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 25 శాతం పంట దళారుల పాలవుతోందని తెలిపారు. పంటల బీమా అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.