WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 110 మంది వ్యక్తులు మద్యం తాగి పట్టుబడ్డారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 42 మంది, వెస్ట్ జోన్లో 26 మంది, సెంట్రల్ జోన్లో 23 మంది, ఈస్ట్ జోన్లో 19 మంది కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.