పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అసద్ అక్తర్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నోబాల్ వేశాడు. లాహోర్ బ్లూస్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ బ్లూస్ తరఫున ఆడిన అసద్ క్రీజు లైన్ నుంచి చాలా ముందుకెళ్లి బౌలింగ్ చేశాడు. అతడు ఆ ఓవర్లో 21 పరుగులిచ్చాడు. రెండు వైడ్స్, రెండు నోబాల్స్ వేశాడు. దీంతో అతడు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడా? అని క్రికెట్ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.