E.G: రాజమండ్రి రైల్వేస్టేషన్ అడ్వైజరీ కమిటీ బోర్డు సభ్యులు, రైల్వే సిబ్బంది ఇవాళ పారిశుద్ధ్య నిర్వహణలో విశేష సేవలు చేస్తున్న మహిళలను సాలువాతో సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం & ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని వారికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చీరలు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికుల అంకితభావం సేవలను ప్రశంసించారు.