BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాల భవన దుస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే మరమ్మత్తులు, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.