NTR: తిరువూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో దివ్యాంగ శక్తీ పథకం కింద వికలాంగుల ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్, నగర పంచాయతీ కమిషనర్ మనోజ్ బుధవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు మేలు చేకూరుతుందని డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం అన్నారు. కూటమి నాయకులు, డిపో సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.