మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల వేళ దర్శకుడు ఆదిత్య ధర్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. థియేటర్లలోనే మువీ చూసి ఆ మ్యాజిక్‌ను అనుభవించాలని, మొబైల్స్ లేదా పైరసీలో చూసి తమ కష్టాన్ని వృధా చేయొద్దని కోరాడు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడం కోసం టీం ఎంతో కష్టపడిందన్నాడు. మూవీలో ఊహించని మలుపులు ఉన్నాయని, చూసిన వారు ‘స్పాయిలర్స్’ పంచుకోకుండా ఇతరుల కుతూహలాన్ని కాపాడాలన్నాడు.