అన్నమయ్య: ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం “దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులకు బస్ పాసులు అందజేశారు. 40% పైగా వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తించగా, జిల్లాలో వేలాది మంది దివ్యాంగులు లాభపడనున్నారు.