TG: అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో ఏర్పడే హిందువుల ప్రభుత్వంలో తాను హోంమంత్రిని అవుతానని హరీష్ రావుతో ధీమాగా చెప్పారు. ఇదే చివరి కాంగ్రెస్ ప్రభుత్వమని, హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దని.. గతంలోలా ఎక్కువ మంది పిల్లలను కనాలని పేర్కొన్నారు. రాకేష్ రెడ్డి మాటలకు స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు ఆయనకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు.